వార్డుల పర్యటనకు వస్తున్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
– నేడు ముగుస్తున్న గల్లిగల్లికీ ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మున్సిపల్లో వార్డుల పర్యటనను కొనసాగించనున్నారు. గల్లి గల్లీకి ఎమ్మెల్యే రెండో విడత కార్యక్రమంలో భాగంగా నేడు మంగళవారం ఉదయం నుంచి వార్డులలో పర్యటించనున్నారు. మున్సిపల్ పరిధిలోని 26,27,31,32,33,34,35,36 వార్డుల్లో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకోనున్నారు. ఊ.8:00 గంటలకు 26 వ వార్డు శివాజీ చౌక్ అప్నా బజార్ నుండి ఎమ్మెల్యే పర్యటన ప్రారంభం కానుంది. అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు అందరూ హాజరు కావాల్సిందిగా నాయకులు విజ్ఞప్తి చేశారు. మరోవైపు తాండూరులో చేపట్టిన గల్లి గల్లీకి ఎమ్మెల్యే కార్యక్రమం నేటితో ముగియనుంది. నిన్నటికి మున్సిపల్లోని 28 వార్డుల్లో ఎమ్మెల్యే పర్యటనను పూర్తి చేసుకోగా నేడు ఒక్కరోజే మిగతా 8 వార్డుల్లో పర్యటించబోతున్నారు. ఈ లెక్కన తాండూరులో గల్లిగల్లికీ ఎమ్మెల్యే కార్యక్రమం నేటితో ముగియనుంది.

