వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్
– అందుబాటులో క్షణాల్లో ఫోటో పంపే కెమెరా
– పేర్లతో కాకుండా నెంబర్లతో కాంట్రాక్టుల సెర్చ్ ఆప్షన్
దర్శిని డెస్క్: స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరు వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. వాట్సాప్ వినియోగ దారుల కోసం కంపెని ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకవస్తుంది. ఇప్పటికే గ్రూప్‌లో ఎవరైనా సభ్యులు పోస్ట్ చేసిన అభ్యంతరకరమైన వీడియోలు/చిత్రాలు మరియు సందేశాలను నిరోధించే వెసులుబాటును తీసుకవచ్చింది. ఈ వ్యవస్థతో గ్రూప్ అడ్మిన్‌తో పాటు సభ్యులు అభ్యంతరకరమైన పోస్ట్‌ను తొలగించే అవకాశాన్ని కల్పించారు. ఇంతకుముందు ఈ సదుపాయం ప్రైవేట్‌గా అందుబాటులో ఉంది. ఇలాంటి సదుపాయాలను యూజర్లకు ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా కొత్త ఫీచర్లను అందిస్తోంది.

తాజాగా వాట్సాప్ ద్వారానే త్వరగా ఫోటో తీసే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఫీచర్‌తో వాట్సాప్ చాట్‌ని తెరవగానే కెమెరా ఫీచర్ అందుబాటులో ఉంచింది. అక్కడ ఉన్న కెమెరా ఆప్షన్‌పై క్లిక్ చేయడం ద్వారా వెంటనే ఫోటో తీసి కాంట్రాక్టు సభ్యులకు పంపవచ్చు. యూజర్ ఎవరైనా త్వరగా ఫోటో తీసి గ్రూప్‌లో ఎవరికైనా పంపాల్సి వస్తే మొబైల్ కెమెరాలోంచి ఫోటో తీసి మొబైల్ గ్యాలరీ ద్వారా ఫోటో పంపించేవారు. మరోవైపు ఒక గ్రూపులో వచ్చిన సందేశాలను మరోకరికి పంపాలంటే సెర్చింగ్ ఆప్షన్‌లో ఇదివరకు పేరుతో అక్షరాలను వెతికే వారు. ఇప్పుడు నెంబర్లతో వెతికే వెసులుబాటును కూడ కల్పించింది. కొత్త ఫీచర్లు యూజర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


