స్వాతంత్ర్య స్పూర్తితోనే సర్కారు సంక్షేమం

తాండూరు రాజకీయం వికారాబాద్

స్వాతంత్ర్య స్పూర్తితోనే సర్కారు సంక్షేమం
– మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్
– వ‌జ్రోత్స‌వాల‌లో ఉత్స‌హాంగా పండ్ల పంపీణీ
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: భార‌త స్వాతంత్ర్య స్పూర్తితోనే తెలంగాణ స‌ర్కారు ప్ర‌జా సంక్షేమానికి కృషి చేస్తుంద‌ని తాండూరు మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ పేర్కొన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవా వేడుకల్లో భాగంగా శుక్ర‌వారం ఐసీడీఎస్ ఆధ్వ‌ర్యంలో పండ్ల పంపిణీ నిర్వ‌హించారు. ప‌ట్ట‌ణంలోని జిల్లా ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మానికి మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ ముఖ్య అతిథిగా హాజ‌రై ఐసీడీఎస్ అధికారులు, అంగ‌న్ వాడి టీచ‌ర్ల‌తో క‌లిసి రోగుల‌కు పండ్లు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా చైర్ ప‌ర్స‌న్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్ర‌జా సంక్షేమానికి పెద్దపీట వేశార‌న్నారు. భార‌త స్వాతంత్ర్య వ‌జ్రోత్స‌వాల‌లో భాగంగా సేవా కార్య‌క్ర‌మాలు కూడ నిర్వ‌హిస్తుంద‌న్నారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ శోభారాణి, కౌన్సిలర్లు రామకృష్ణ, వెంకన్న గౌడ్, బోయ రవిరాజు, మాజీ డీపీసీ స‌భ్యులు ప‌ట్లోళ్ల నర్సింలు, సాయిపూర్ బాల్ రెడ్డి, సీడీపీఓ రేణుక‌, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.