పెండ్లికి వెళ్తే ఇల్లు గుల్ల..!
– తాండూరులో భారీ చోరీ
– ప్లాట్ అమ్మి దాచిన సొమ్ము మాయం
– దాదాపు రూ. 28 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు
– పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడి వెల్లడి
తాండూరు, దర్శిని ప్రతినిధి : పెండ్లికి అవి వెళితే.. ఇల్లు గుల్లయ్యింది. ఫ్లాట్ అమ్మి దాచిపెట్టిన డబ్బులు మాయం అయ్యాయి. తాండూరు పట్టణంలోని రైల్వే బ్రిడ్జి సమీపంలో భారీ చోరీ అయిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆర్టీఐ కన్సల్ టెంట్ గా పనిచేస్తున్న మహమ్మద్ వాజీద్ పట్టణంలోని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో ఉన్న ఆప్గారి మజీద్ పక్కన నివాసం ఉంటున్నారు. రెండు రోజుల క్రితం వాజీద్ అన్న కుమారుడు వివాహాము ఉండడంతో కుటుంబంతో కలిసి హైదరాబాద్ వెళ్లారు. కందనెల్లి మేయిన్ రోడ్డు సమీపంలో 240 గజాలు ఉన్న ప్లాట్ అమ్మగా వచ్చిన రూ.26 లక్షలు, తన సంపాదన. కింద ఉన్న మరో రూ. 2 లక్షలను ఇంట్లోని బీరువాలోనే ఉంచారు. పెళ్లి ముగిసిన తరువాత శుక్రవారం రాత్రి ఇంటికి చేరుకున్నారు.
ఇంటికి వచ్చే సరికి ఇంటి తాళం పగులగొట్టి ఉండడంతో అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి చూశారు. అప్పటికే బీరువా తెరిచి ఉండడం, అందులోని డబ్బులు మాయం కావడంతో చోరీ జరిగినట్లు.. నిర్ధారించుకున్నారు. వెంటనే తాండూరు పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్, పోలీసులు సంఘటనా.. స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలను సేకరించారు. మరోవైపు బాధితుడు వాజీద్ ఇంట్లో రూ. 28 లక్షలు చోరీ జరిగినట్లు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. తాండూరు పట్టణంలో ఈ భారీ చోరి సంఘటన కలకలం రేపింది. దీంతో పోలీసులు చోరీ సంఘటనపై విచారణ ముమ్మరం చేశారు.
ఇది కూడా చదవండి…


