ఒకేసారి 9 కార్లు ఢీ..!
– బ్యాక్ టు బ్యాక్ డ్యాష్
– షాద్ నగర్ జాతీయ రహదారిపై ఘటన
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : కొంపలు మునిగినట్లు దూసుకెళ్లిన వేగం నిజంగానే వాళ్ల కొంపలు ముంచాయి. ఒకే వరసలో వెళ్లే కార్లు అకస్మాత్తుగా ఆగిపోవడంతో ఒకేసారి 9 కారులు బ్యాక్ టు బ్యాక్ ఢీకొన్నాయి. కారులో మహిళలు, చిన్నారులు ఉన్న ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. హైదరాబాద్ శివారు షాద్ నగర్ సమీపంలోని బెంగళూరు మార్గంలోని 44వ జాతీయ రహదారిపై ఈ విచిత్ర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రతక్ష్య సాక్షుల కథనం మేరకు ఆదివారం మధ్యాహ్నం 1-40 గంటలకు షాద్‌నగర్ హైవేపై ఎప్పటిలాగే వేగంగా వాహనాలు రయ్.. రయ్.. హరన్ శబ్దాలతో వేగంగా కదిలిపోతున్నాయి. మార్గం మద్యలోని రసోయ్ హోటల్ సమీపంలో ఓ కారు డ్రైవర్ అతివేగంతో ముందుకెళ్తున్నాడు. బాధ్యతాయుతంగా మరియు హైవే నిబంధనలను ఉల్లంఘిస్తూ, కారును సడన్ బ్రేక్ చేశార. దీంతో ఆ వెనుక వస్తున్న 9 కార్లు ఈ కారును వెనుక నుండి బ్యాక్ టు బ్యాక్ ఢీకొన్నాయి. దీంతో అడుగు కూడ గ్యాప్ లేకుండా ఒకదానికొకటి ఇరుక్కుపోయాయి. ఈ కార్లలో మహిళలు, పిల్లలు కూడా వెళుతుండగా, అదృష్టవశాత్తూ క్షేమంగా ఉన్నారని, వారికి స్వల్ప గాయాలయ్యాయి. అప్రమత్తయ్యారు. స్థానికులు ఈ దృశ్యాలను వీడియో తీశారు. ఈ ప్రమాదం విషయం తెలుసుకున్నషాద్ నగర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదం కారణంగా హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు అన్ని కార్లను తొలగించారు ట్రాఫిక్ వ్యవస్థను పునరుద్ధరించారు. జరిగిన ప్రమాదంపై విచారణ చేపట్టారు. మరోవైపు జరిగిన సంఘటనపై పలువురు విమర్శలు చేశారు.


