శ్రీ‌వారి సేవ‌లో పైలెట్ ఫ్యామిలీ

తాండూరు రాజకీయం వికారాబాద్

శ్రీ‌వారి సేవ‌లో పైలెట్ ఫ్యామిలీ
– ద‌ర్శించుకున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తిరుమ‌ల క్షేత్రంలో వెల‌సిన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి సేవ‌లో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫ్యామిలీ త‌రించింది. బుధ‌వారం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స‌తీమ‌ణి ఆర్తి రెడ్డి, బావ న‌వీన్, సోద‌రి మౌనిక‌, కుటుంట స‌భ్యులు, స‌న్నిహితులతో క‌లిసి వెంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్నారు. ఆల‌య పండితుల ఆధ్వ‌ర్యంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కుటుంబ స‌భ్యుల‌తో స్వామి వారికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం వేదపండితులు ఎమ్మెల్యే, కుటుంబ స‌భ్యుల‌ను మంత్రోచ్చ‌ర‌ణ‌ల‌తో ఆశీర్వదించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు ప్ర‌జ‌ల క్షేమం కోసం దేవున్ని ప్రార్థించిన‌ట్లు తెలిపారు.