గ్రంథాల‌యాల ఆధునీక‌ర‌ణ‌కు కృషి

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

గ్రంథాల‌యాల ఆధునీక‌ర‌ణ‌కు కృషి
– త్వ‌ర‌లోనే కొత్త లైబ్ర‌రీల ప్రారంభం
– పాఠ‌కుల కోసం మెరుగైన వ‌స‌తులు
– అంద‌రి స‌హాకారంతో ముందుకు సాగుతాం
వికారాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి : జిల్లాలోని గ్రంథాల‌యాల ఆధునీక‌ర‌ణ‌కు కృషి చేయ‌డం జ‌రుగుతుంద‌ని వికారాబాద్ జిల్లా గ్రంథాల‌య సంస్థ చైర్మ‌న్ రాజుగౌడ్ అన్నారు. శుక్ర‌వారం జిల్లా కేంద్రంలోని గ్రంథాల‌య స‌మావేశ మందిరంలో మండ‌ల లైబ్ర‌రీయ‌న్స్, ఉద్యోగుల‌తో సమీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా చైర్మ‌న్ రాజుగౌడ్ గ్రంథాల‌యాల స్థితిగ‌తుల‌పై, అభివృద్ధికి సంబంధించిన విష‌యాల‌పై చ‌ర్చించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ జిల్లాలోని గ్రంథాల‌యాల‌తో మౌళిక స‌దుపాయాల‌తో పాటు ఆధునీక‌ర‌ణ‌కు కృషి చేయ‌డం జ‌రుగుతుంద‌ని అన్నారు. స‌మావేశంలో దృష్టికి వ‌చ్చిన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌త్యేక దృష్టిసారిస్తామ‌న్నారు. ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌ను స‌త్వ‌ర‌మే ప‌రిష్కారం అయ్యేలా చూస్తామ‌న్నారు. అదేవిధంగా జిల్లాలో నూత‌నంగా నిర్మించిన గ్రంథాల‌యాల‌ను త్వ‌ర‌లోనే మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల స‌హాకారంతో ప్రారంభానికి దృష్టిసారిస్తామ‌న్నారు. అధికారులు, ప్ర‌జా ప్ర‌తినిధులు, ఉద్యోగుల స‌మ‌న్వ‌యంతో సంస్థ‌ను అభివృద్ధి ప‌రిచేందుకు కృషి చేస్తామ‌న్నారు. అదేవిధంగా జిల్లా గ్రంథాల‌య చరిత్ర‌లో మొట్ట మొద‌టి బ‌దిలీ ఉత్త‌ర్వును అంద‌జేయ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. ఈ కార్యాల‌యంలో జిల్లా గ్రంథాల‌య సంస్థ సెక్ర‌ట‌రీ సురేష్ బాబు, ప‌ట్ట‌ణ‌, వివిధ మండ‌లాల లైబ్రీరీయ‌న్‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.