తాండూరు మండ‌ల వాసుల‌కు శుభ‌వార్త

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు మండ‌ల వాసుల‌కు శుభ‌వార్త
– రేపు కొత్త ఆసరా పించన్‌ల‌ పంపిణీ
– ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేతుల మీదుగా అంద‌జేత‌
తాండూరు రూర‌ల్, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు మండ‌ల వాసుల‌కు అధికారులు శుభ‌వార్త చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన కొత్త అసరా ఫించన్లను రేపు పంపిణీ చేయ‌బోతున్న‌ట్లు తాండూరు ఎంపీడీఓ సుద‌ర్శ‌న్ రెడ్డి ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఇందుకు అన్ని ఏర్పాట్ల‌ను సిద్దం చేసిన‌ట్లు వెల్ల‌డించారు. ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిల చేతుల మీదుగా రేపు సోమ‌వారం మధ్యాహ్నం 1 గంటకు తాండూరు పట్టణంలోని భవానీ ఫంక్షన్ హాల్లో ల‌బ్దిదారుల‌కు అంద‌జేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. కార్య‌క్ర‌మంలో ఎంపీపీ, జెడ్పీటీసీల‌తో పాటు మండ‌లంలోని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు హాజరువుతారని చెప్పారు. వారి స‌మ‌క్షంలోనే తాండూరు మండలానికి మంజూరైన 1563 మందికి కొత్త ఫించన్లను మంజూరు చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, లబ్దిదారులు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.