వ్యాపారిని వరించిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్
– మరొకరికి హొండా యాక్టీవా
– లక్కీ డ్రా విజేతలకు అందజేసిన సమితి సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం వినాయక చౌరస్తాలో వినాయక ఉత్సవ సమితి సభ్యులు ఏర్పాటు చేసిన లక్కీ డ్రాలో ఓ వ్యాపారికి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ వరించింది. మరొకరు హొండా యాక్టీవా సొంతం చేసుకున్నారు. ప్రతి యేడాది మాదిరిగానే పట్టణంలోని వినాయక చౌరస్తా వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భారీ వినాయకున్ని ప్రతిష్టించారు. గత కొన్నేళ్లుగా సమితి ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. ఈ సారి కూడ మొదటి బహుమతిగా రాయల్ ఎన్ఫీల్డ్ బైకు, హొండా యాక్టీవా స్కూటీని లక్కీ నిర్వహించారు.

లక్కీ డ్రాలో తాండూరు పట్టణానికి చెందిన వ్యాపారి ప్రకాష్ రావు మొదటి బహుమతి(టికెట్ నెంబర్ 6411) రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్టు వరించింది. అదేవిధంగా తాండూరు మండలం అంతారం తాండాకు చెందిన శంకర్ నాయక్‌కు రెండవ బహుమతి(టికెట్ నెంబర్ 4811)గా హోండా యాక్టివా స్కూటీని గెలుచుకున్నారు. బుధవారం వినాయక సమితి సభ్యులు పద్మనాభం, నాగభూషణంలు లబ్దిదారులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు రంచెందర్, నరహరి, చంద్ర కాంత్, పునీత్ కుమార్, అరుణ్, అక్షయ్, వెంకటేష్, నరేష్, చందు, అమ్రేష్ తదితరులు పాల్గొన్నారు.


