మార్వాడి యువమంచ్ సేవా తత్పరత

తాండూరు రాజకీయం వికారాబాద్

మార్వాడి యువమంచ్ సేవా తత్పరత
– తిమ్మాయిపల్లిలో రక్తదాన శిబిరం ఏర్పాటు
– 60 మంది వృద్ధులకు దుప్పట్లు పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : గణతంత్ర దినోత్సవం రోజు తాండూరు మార్వాడి యువమంచ్ సభ్యులు సేవా తత్పరతను చాటుకున్నారు. 77వ గణతంత్ర దినోత్సవంను పురుస్కరించుకుని తాండూరు పట్టణంలోని బాలాజీ మందిరంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

అదేవిధంగా మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో యాలాల మండలం తిమ్మాయిపల్లిలో తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి రక్తనిధి కేంద్రం వారి సహాకారంతో రక్తదాన శిభిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో యువకులు, గ్రామస్తులు, సభ్యులు పాల్గొని 21 యూనిట్ల రక్తదానం చేశారు. అదేవిధంగా గ్రామంలోని 60 మంది వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. గణతంత్ర వేడుకలలో భాగంగా విద్యార్థులకు గ్రామ పాఠశాలలో 86 మంది విద్యార్థులకు నిర్వహించిన ఆటపోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు.

చిన్నారులకు చాక్లెట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్వాడి యువమంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు మన్మోహన్ సార్డా, తాండూరు అధ్యక్షులు అనిల్ సార్డా, కోశాధికారి అరుణ్ సార్డా, రాష్ట్ర ఉపాధ్యక్షులు కిషన్ రాఠి, ఏఎంసీ డైరెక్టర్ రాజు, గ్రామ సర్పంచ్ అమర్ నాథ్ రెడ్డి, గ్రామ పెద్దలు భీమప్ప, యువకులు, మంచ్ సభ్యులు పవన్ సోని, నితిన్ సోమాని, బ్రిజ్ మోహన్ బూబ్, దినేష్ పర్తాని, రమాకాంత్ పండిత్, లక్ష్మీనారాయణ బూబ్, కరణ్ జైన్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

గులాబీ గెలుపు గుర్రాలు..!