న‌గ‌రేశ్వ‌రుని స‌న్నిధిలో రాజుగౌడ్‌కు స‌న్మానం

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

న‌గ‌రేశ్వ‌రుని స‌న్నిధిలో రాజుగౌడ్‌కు స‌న్మానం
– గౌర‌వించిన ఆల‌య చైర్మ‌న్, సంఘం స‌భ్యులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు ప‌ట్ట‌ణంలోని ప్ర‌సిద్ద శ్రీ న‌గ‌రేశ్వ‌ర దేవాల‌య స‌న్నిధిలో వికారాబాద్ జిల్లా గ్రంథాల‌య సంస్థ చైర్మ‌న్ రాజుగౌడ్‌కు ఘ‌న స‌న్మానం జ‌రిగింది. ప్ర‌తి సోమ‌వారం దేవాల‌యంలో మ‌హా కార్య‌క్ర‌మాన్ని వైభ‌వంగా నిర్వ‌హిస్తున్నారు. తాజాగా నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి ఆల‌య చైర్మ‌న్ కుంచెం ముర‌ళిధ‌ర్, ఆర్య‌వైశ్య సంఘం స‌భ్యులు వికారాబాద్ గ్రంథాల‌య సంస్థ చైర్మన్‌గా నియామ‌క‌మైన సంద‌ర్భంగా రాజుగౌడ్‌ను ఆహ్వానించారు.

మ‌హా హార‌తి కార్య‌క్ర‌మంలో రాజుగౌడ్‌ను ఆల‌య పండితులు వేధ మంత్రాల‌తో దీవించి ఆశీర్వ‌దించారు. అనంత‌రం ఆల‌య చైర్మ‌న్ ముర‌ళిధ‌ర్, ఆర్య‌వైశ్య సంఘం స‌భ్యులు రాజుగౌడ్‌ను శాలువాతో సన్మానించి జ్ఞాపిక‌ను అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా రాజుగౌడ్ మాట్లాడుతూ అన్ని సంఘాల‌తో పాటు ఆర్య‌వైశ్య సంఘం స‌భ్యులు, ప్ర‌ముఖులు చూపిస్తున్న ఆద‌ర‌ణ మ‌రువ‌లేనిన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆర్య‌వైశ్య సంఘం స‌భ్యులు క‌ట్కం వీరేంద‌ర్, కోట్రిక శ్రీ‌కాంత్, వాస‌వి మ‌హిళ సంఘం, భ‌క్తులు త‌దిత‌రులు పాల్గొన్నారు.