బీఆర్ఎస్ బలోపేతానికి మరింత కృషి చేయండి

తాండూరు రాజకీయం వికారాబాద్

బీఆర్ఎస్ బలోపేతానికి మరింత కృషి చేయండి
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– పట్టణ పార్టీ మహిళ అధ్యక్షురాలుగా సంగీతా ఠాకూర్
– నియామకపత్రం అందజేసిన ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతానికి కృషి చేయాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ పట్టణ మహిళ అధ్యక్షురాలు నియామకం జరిగింది. పట్టణంలోని 20వ వార్డుకు చెందిన కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్‌ను పట్టణ అధ్యక్షురాలుగా నియమిస్తూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సంగీత ఠాకూర్‌కు నియామకం పత్రం అందజేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో మహిళ నేతల పాత్ర ముఖ్యమైందన్నారు. పార్టీని పటిష్టం చేయడంలో వారు శక్తివంచన పనిచేస్తారని అన్నారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షురాలుగా నియామకం అయిన సంగీత ఠాకూర్ పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని, పార్టీ అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

మరోవైపు తనకు పట్టణ అధ్యక్షురాలు పదవిని అప్పగించడం పట్ల ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో పాటు పార్టీ సీనీయర్ నాయకులకు సంగీత ఠాకూర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్ పర్సన్ వీణ శ్రీనివాస్ చారి, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి…

14 మంది మట్కారాయూళ్లపై కేసు