విజ్ఞానవంతమైన ముద్ర వేయండి

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

విజ్ఞానవంతమైన ముద్ర వేయండి
– రాజుగౌడ్‌ను సన్మానించిన టీఆర్ఎస్ నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : గ్రంథాలయాల అభివృద్ధితో విజ్ఞానవంతమైన ముద్ర వేయాలని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ తో టీఆర్ఎస్ నాయకులు పంజుగుల వికల్ రెడ్డి, పంజుగుల శ్రీశైల్ రెడ్డిలు అన్నారు. సోమవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నియామకమైన రాజుగౌడ్ ను సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంథాలయ చైర్మన్ గా రాజుగౌడ్ నియామకం అభినందనీయమన్నారు. యువతకు, నిరుద్యోగులకు విజ్ఞానాన్ని పంచేవిధంగా గ్రంథాలయాలను అభివృద్ధి పరిచి చెరగని ముద్రవేయాలని అన్నారు. అదేవిధంగా రాజుగౌడ్ మాట్లాడుతూ మంత్రి సబితా రెడ్డి, ఎం. పీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిల సహాకారంతో గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, బషీరాబాద్ మార్కెట్ కమిటి చైర్మన్ రాజారత్నం, బషీరాబాద్ మండల అధ్యక్షులు రామునాయక్, తాండూరు ఏఎంసీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.