పేదలకు అందివచ్చే ఆసరా..!

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

పేదలకు అందివచ్చే ఆసరా..!
– కార్డులు పంపిణీ చేసిన కౌన్సిలర్ లత సుమిత్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : అర్హులైన పేదలకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పథకం అందివస్తుందని తాండూరు మున్సిపల్ 32వ వార్డు కౌన్సిలర్ సందుల లత సుమిత్ గౌడ్ అన్నారు. బుధవారం తన వార్డులో నూతనంగా ఫించన్ మంజూరైన లబ్దిదారులకు గుర్తింపుకార్డులు, ఫించన్ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వృద్ధులకు, పేదలకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ 57 ఏండ్ల వారికే ఆసరా ఫించన్ అమలు చేస్తున్నారని అన్నారు. అర్హులైన వారికి ఫించన్ మంజూరుతో ఆర్థిక భరోసా కూడ అందుతుందన్నారు. లబ్దిదారులు ఆసరా ఫించన్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు శివానంద్, నాయకులు కులకర్ణి ప్రశాంత్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.