సీఎం నిర్ణయం చిరస్మరణనీయం
– సచివాలయంకు అంబేద్కర్ పేరు అభినందనీయం
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ నూతన సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ నామకరణం చేయాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చిరస్మరణీయంగా ఉంటుందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలోని విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన సచివాలయానికి సీఎం కేసీఆర్ అంబేద్కర్ నామకరణం చేస్తామని తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం చిరస్థాయిగా నిలిచిపోతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మల్లప్ప, భద్రేశ్వర దేవాలయ చైర్మన్ బంటారం సుధాకర్, తాండూరు మండల అధ్యక్షులు రాందాస్, రైతు సమితి కోఆర్డినేటర్ రాంలింగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


