రేపు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు
– ఉత్తర్వులు జారీ చేసిన చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు విద్యాసంస్థలకు సర్కారు రేపు సెలవును ప్రకటించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శుక్రవారం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రవేటు విద్యాసంస్థలు అన్ని సెలవు పాటించాలని సూచించారు.


