న‌వ స‌మాజంలో మ‌హిళ‌లే కీల‌కం

తాండూరు రాజకీయం వికారాబాద్

న‌వ స‌మాజంలో మ‌హిళ‌లే కీల‌కం
– త‌లుచుకుంటే దేనినైనా సాధించే శ‌క్తి స్వ‌రూపులు
– ఆర్యవైశ్య మహిళ సంఘం సేవ అభినందనీయం
– వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : న‌వ‌ సమాజంలో మ‌హిళ‌ల‌ కీలక పాత్ర ఎంతో ఉంద‌ని, త‌లుచుకుంటే దేనినైనా సాధించే శ‌క్తి స్వ‌రూపులు అని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ ఉద్ఘాటించారు. సోమవారం పట్టణంలోని నగరేశ్వర ఆలయంలో ఆర్యవైశ్య మహిళ సంఘం ఆధ్వర్యంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నియామకైన రాజుగౌడ్‌కు ఘన సన్మానం నిర్వహించారు.

మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ, ఆలయ కమిటి చైర్మన్ కుంచెం మురళి, ఆర్యవైశ్య మహిళ సంఘం అధ్యక్షురాలు కల్వ సరిత తదితరులు ఆలయంలో రాజుగౌడు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాజుగౌడ్ మాట్లాడుతూ నవ సమాజ నిర్మాణంలో స్త్రీల పాత్రే కీలకమని, మహిళలు తలుచుకుంటే దేన్నయినా సాధించడం ఎంతో సులువు అని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఆర్యవైశ్య మహిళ సంఘం చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయని అన్నారు. మహిళలు బతుకమ్మ, నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య యువజన సంఘం నాయకులు కోట్రిక శ్రీకాంత్, మహిళ సంఘం సభ్యులు గుబ్బ ప్రగతి, కోస్గి సరిత, కల్వ స్వాతి తదితరులు పాల్గొన్నారు.