విద్యార్థుల చదువులపై దృష్టి సారించాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

విద్యార్థుల చదువులపై దృష్టి సారించాలి
– కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్
– స్కూళ్లలో సర్వీస్ పర్సన్ నియామకం కోసం తీర్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థుల చదువుల పట్ల తల్లిదండ్రులు శ్రద్ద చూపాలని తాండూరు మున్సిపల్ గాంధీనగర్‌ కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ అన్నారు. శనివారం గాంధీనగర్‌ లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ సంగీత ఠాకూర్ మాట్లాడుతూ పాఠశాలల్లో త్రైమాసిక పరీక్షలు వస్తున్నందున తల్లిదండ్రులు తమ పిల్లలు పాఠశాలకు సక్రమంగా హాజరయ్యేలా చూడాలన్నారు.

పరీక్షల సమయం కాబట్టి విద్యార్థులు సమయాన్ని వృదా చేయకుండా చదువుపై దృష్టి పెట్టేలా చూడాలన్నారు. విద్యార్థులకు సమయ పాలన, పెద్దల పట్ల గౌరవం, క్రమ శిక్షణ నేర్పడం వల్ల ఉత్తమ పౌరులుగా ఎదుగుతారన్నారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో సర్వీస్ పర్సన్ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోలాని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం నాగదేవి, టీచర్లు సరిత, జగదీశ్వరీ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవడి…

విద్యార్థులతో దీపావళీ జోష్..!