తెలంగాణ ఆత్మ గౌర‌వం బ‌తుకమ్మ

తాండూరు రాజకీయం వికారాబాద్

తెలంగాణ ఆత్మ గౌర‌వం బ‌తుకమ్మ
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– సింధు కాలేజీలో ఉత్సహంగా బతుకమ్మ సంబరాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వం, సంస్కృతికి చిహ్నం బతుకమ్మ పండగ అని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహత్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని సింధు డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాలలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాశాల విద్యార్థినిలు తీరొక్క పూలతో అలంకరించి తీసుకవచ్చిన బతుకమ్మను ఎత్తి సంబరాలను ప్రారంభించారు.
మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, కళాశాల ప్రిన్సిపల్, కౌన్సిలర్ విజయదేవి, కళాశాల విద్యార్థినిలతో కలిసి ఎమ్మెల్యే బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం బతుకమ్మ పండగ అని అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండగకు సర్కారు ప్రాధాన్యమిస్తోందన్నారు. అందరు పండగను, సంబరాలను ఉత్సహాంగా జరుపుకొ కావాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, కళాశాల వ్యవస్థాపకులు రంగారావు, నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు.