నెంబ‌ర్ ప్లేట్లు లేకుండా బైకులు న‌డిపిస్తే చ‌ర్య‌లు

క్రైం తాండూరు వికారాబాద్

నెంబ‌ర్ ప్లేట్లు లేకుండా బైకులు న‌డిపిస్తే చ‌ర్య‌లు
– తాండూరు డీఎస్పీ జీ.శేఖ‌ర్ గౌడ్
– స్పెష‌ల్ డ్రైవ్‌లో 65 బైకుల సీజ్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : నెంబ‌ర్ ప్లేట్లు లేకుండా వాహ‌నాలు న‌డిపిస్తే చ‌ర్య‌లు తీప్ప‌వ‌ని తాండూరు డీఎస్పీ జీ. శేఖ‌ర్ గౌడ్ అన్నారు. గురువారం తాండూరు ప‌ట్ట‌ణ సీఐ రాజేంద‌ర్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో మోటారు సైకిల్(బైకులు)ల‌పై త‌నిఖీలు నిర్వ‌హించారు. ప‌ట్ట‌ణంలోని విలియ‌మూన్ చౌర‌స్తా, శివాజీ చౌర‌స్తాలో స్పెష‌ల్ డ్రైవ్ చేప‌ట్టారు. నెంబ‌ర్ ప్లేట్లు, టీఆర్ నెంబ‌ర్, రిజిస్ట్రేష‌న్ వంటి వాటిని త‌నిఖీ చేశారు. విలియ‌మూన్ చౌర‌స్తా వ‌ద్ద చేప‌ట్టిన స్పెష‌ల్ డ్రైవ్‌లో డీఎస్పీ శేఖ‌ర్ గౌడ్ హాజ‌రై సీఐ రాజేంద‌ర్ రెడ్డితో క‌లిసి వాహ‌నాల‌ను త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ వాహ‌న దారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాల‌ని సూచించారు. వాహ‌నాల‌కు నెంబ‌ర్ ప్లేట్లు లేకుండా వాహ‌నాల‌ను న‌డిపిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. కావున అంద‌రు నెంబ‌ర్ ప్లేటు ఉంచుకోవాల‌ని, వాహ‌నాల‌ను రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల‌న్నారు. అదేవిధంగా సీఐ రాజేంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ సాయంత్రం నుంచి చేప‌ట్టిన త‌నిఖీల‌లో నెంబర్ ప్లేటు లేనివాటితో పాటు స‌రిగ్గా ఉంచుకోని బైకులు, టీఆర్, రిజిస్ట్రేష‌న్ లేని మొత్తం 65 బైకుల‌ను సీజ్ చేయ‌డం జ‌రిగింద‌ని వెల్ల‌డించారు. ఈ త‌నిఖీల‌లో ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.