దైవ రూపాయిల ముద్రేయండి..!

కెరీర్ జాతీయం తెలంగాణ లైఫ్-స్టైల్ హైదరాబాద్

దైవ రూపాయిల ముద్రేయండి..!
– కొత్త నోట్లపై లక్ష్మీ, విఘ్నేశ్వర చిత్రాలకు విజ్ఞప్తి
– పీఎం నరేంద్రమోడిని కోరిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
దర్శిని డెస్క్: భారతీయ కరెన్సీ నోట్లపై దేశ రాజధాని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరుదైన వాఖ్యలు చేశారు. కొత్తగా ముద్రించే నొట్లపై దైవ రూపాలను ఉంచాలని భారత ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ సంఘటన దేశంలో సంచలనంగా మారింది. నోట్లపై మహాత్ముడి ఫోటోలతో పాటు దేవతల చిత్రాలు ఉంచడం వల్ల దేశం అభివృద్ధి మార్గంలో పయనిచేందుకు ఉపయోగపడుతుంది కేజ్రీవాల్ అభిప్రాయ పడ్డారు. అన్ని నోట్లను మార్చాలని మేం చెప్పడం లేదని, అయితే ముద్రించే కొత్త నోట్లపై లక్ష్మీ, గణేశుడి బొమ్మ ఉండాలని చెబుతున్నామని అన్నారు. హిందువుల ఆరాధ్యదైవానికి వ్యతిరేకంగా మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ చేసిన ప్రకటన, దీపావళి నాడు బాణసంచా నిషేధం నిర్ణయం తర్వాత అరవింద్ కేజ్రీవాల్ హిందూ వ్యతిరేకి అని ప్రతిపక్షాలు నిరంతరం ఆరోపిస్తున్న సమయంలో అరవింద్ కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండోనేషియాలో ముస్లిం జనాభా అధికంగా ఉన్నప్పటికీ.. ఆ దేశ నోట్లపై గణేశుడి చిత్రం ఉంటుంది. ఇండోనేషియానే చేయగలిగినప్పుడు.. మన వల్ల ఎందుకు కాదు..? డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణిస్తుండటంతో దేశం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించేందుకు మన ప్రయత్నాలతో పాటు దేవుడి ఆశీస్సులు కూడా అవసరం’ అని వ్యాఖ్యానించారు. భారత కరెన్సీపై ఒకవైపు గాంధీజీ, మరోవైపు లక్ష్మీ, గణేష్ చిత్రపటం పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నానని అన్నారు. దీనిపై త్వరలో ప్రధాని మోదీకి లేఖ రాస్తానని వెల్లడించారు.