పైలెట్ డ్రామా అట్టర్ ఫ్లాఫ్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పైలెట్ డ్రామా అట్టర్ ఫ్లాఫ్..!
– మోసాలు, వివాదాలతోనే కీర్తి
– ఫాంహౌస్ కుట్రలో రోహిత్ రెడ్డికి భాగం
– నిఖార్సత్వాన్ని నిరూపించుకోవాలి
– రాజీనామా చేసి.. క్షమాపక్షణ చెప్పాలి
– మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: రాష్ట్రంలో సంచలనంగా మారిన తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పిరాయింపుల ఎర డ్రామా అట్టర్ ఫ్లాఫ్‌గా నిలిచిందని బీజేపీ జిల్లా నాయకులు విమర్శించారు. నిత్యం మోసాలు, వివాదాలతోనే రోహిత్ రెడ్డి స్టార్‌ అవుతున్నారని అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావే దేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సదానంద రెడ్డి, ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్తో పాటు మాజీ గ్రంథాలయ చైర్మన్ మురళీకృష్ణగౌడ్ పాల్గొని మాట్లాడారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర పేరుతో తెలంగాణ సర్కారు నీచరాజకీయాలు చేస్తోందన్నారు. పిరాయింపుల ఎరలో పట్టుబడిన నిజాలను ఎందుకు బహిర్గతం చేయడం లేదని ప్రశ్నించారు. మొయినాబాద్ ఫాంహౌస్ వేదికగా సంచలనానికి తెరలేపిన తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చేసిన డ్రామా.. స్ర్రీన్‌ప్లే అట్టర్ ఫ్లాఫ్ అయ్యిందన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి రూ. 100 ఎర చూపించారని బీజేపీపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రూపాయికి పనిలేని రోహిత్ రెడ్డిని, పార్టీలు మారి వచ్చిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి బీజేపీకి లేదని.. చీకటి వ్యవహారాలు బీజేపీకి అవసరం లేదని ద్వజమెత్తారు. డ్రగ్స్.. గుట్కా.. మట్కా.. కాసినో.. వివాదాలతో రోహిత్ రెడ్డి కీర్తిని పొందుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని మోసం చేసి టీఆర్ఎస్‌లో చేరిన పైలెట్ మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీని, తాండూరు యువతను, అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రతిష్టను దిగజార్చేందుకే రోహిత్ రెడ్డి ప్రగతి భవన్ ప్లాన్ను అమలు చేశారని అన్నారు. పిరాయింపులు ఎర కుట్రను తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ముందుండి నడిపించారని అన్నారు. డ్రామాను కప్పిపుచ్చుకోవడంలో భాగంగా పట్టుబడిన స్వామిజీ, మద్యవర్తి నంద కుమార్ నుంచి స్వాదీనం చేసుకున్న డబ్బుల విషయంలో అయోమయ పరిస్థితులను సృష్టిస్తున్నారని అన్నారు. అదుపులోకి తీసుకున్న నిందితులను రిమాండుకు తిరస్కరించడంతో టీఆర్ఎస్ కుట్రలు తేటతెల్లం అయ్యాయని అన్నారు. జరిగిన సంఘటనపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీ, సీఐడీ ద్వారా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పిరాయింపుల కుట్రలో తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నిఖార్సైన ఎమ్మెల్యే అయితే… నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని, లేదంటే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీపై నిరాధార ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పార్టీకి భేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేదంటే తాండూరులో తిరగనిచ్చేది లేదని.. అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అంతారం లలిత, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, పూజారి పాండు, రజనీకాంత్, పెద్దేముల్ మండల అధ్యక్షులు సందీప్, యాలాల మండల అధ్యక్షులు మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.