గెలుపు ముగింట్లో గులాబీ

తాండూరు తెలంగాణ రాజకీయం హైదరాబాద్

గెలుపు ముగింట్లో గులాబీ
– ఉత్కంఠత నుంచి ఉత్సహాం వైపు
– పదో రౌండ్లో టీఆర్ఎస్ ఆధిక్యత
హైదరాబాద్, దర్శిని ప్రతినిధిక: మునుగోడు గడ్డపై గులాబీ పార్టీ గెలుపు ముగింట్లో నిలుచుంది. ఉదయం నుంచి ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ఉత్కంఠతగా మొదలై ఉత్సహాంగా కొనసాగుతోంది. మొదటి రౌండ్లో ఆధిక్యతను ప్రదర్శించిన టీఆర్ఎస్ ఆ తరువాతి వరుస స్థానాల్లో వెనుకంజలోకి పడిపోయింది. ఈ రౌండ్లలో బీజేపీ ఆధిక్యతను కొనసాగించగా 4వ రౌండ్ నుంచి ఇప్పటి వరకు జరిగిన 11 రౌండ్‌ వరకు టీఆర్ఎస్ అధిక్యతను ప్రదర్శిస్తోంది. దీంతో మునుగోడు గడ్డపై గులాబీ గెలుపు దాదాపు ఖాయమని శ్రేణులు భావిస్తున్నారు. మరోవైపు మునుగోడు ఉప ఎన్నికల్లో అభ్యర్థుల ఎన్నికల గుర్తులు అధికార తెరాస ఆధిక్యాన్ని కొంత మేర దెబ్బతీశాయని తాజా ఫలితాలను చూస్తే అర్థమవుతోంది. కారును పోలిన గుర్తులకు కూడా చెప్పుకోదగ్గ ఓట్లు పడ్డాయి. 8 రౌండ్లు ముగిసే సమయానికి రోడ్‌రోలర్‌కు 904, చెప్పులకు 1,142, చపాతి మేకర్‌కు 1,169 ఓట్లు వచ్చాయి.

రౌండ్ల వారిగా లెక్కింపు ఇలా