తాండూరు ప్రజలకు శుభవార్త..!
– రేపు బాలాజీ ఆసుపత్రిలో ఫ్రీ చెకింగ్
– అన్ని రకాల వ్యాధుల పరిశీలన
– గర్భిణీ, బాలింతలకు కూడ ఉచిత సేవలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ప్రాంత ప్రజలకు తాండూరు బాలాజీ ఆసుపత్రి యజమాన్యం శుభవార్త చెప్పింది. రేపు మంగళవారం ఆసుపత్రిలో రోగులకు, బాధితులకు ఉచిత చెకింగ్ చేయడం జరుగుతుందని ఓ ప్రకటనలో వెల్లడించింది. బీవీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ సేవలను అందిస్తున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఆసుపత్రి అధినేత డాక్టర్ సంపత్ కుమార్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటలకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. అన్ని రకాల వ్యాధులకు చికిత్స అందించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధగా ప్రముఖ స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ ఎస్. నీరజ పర్యవేక్షణలో గర్భిణిలకు, బాలింతలకు సంబంధిత వ్యాధులకు సంబంధించి ఉచిత సంప్రదింపులు చేసుకోవచ్చన్నారు. ప్రతి మంగళవారం ఈ సేవలు అందుబాటులో ఉంటాయని డాక్టర్ సంపత్ కుమార్ తెలిపారు. ఈ సేవలను తాండూరు పట్టణ, పరిసర ప్రాంతాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

