రేపు కాంగ్రెస్ లోకి సునీతమ్మ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

రేపు కాంగ్రెస్ లోకి సునీతమ్మ..!
– చేరికకు వేధిక, ముహుర్తం ఖరారు
– కుమారుడితో కలిసి చేరిక
– జెడ్పీ చైర్ పర్సన్‌తో పాటు పలువురు కూడా
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారయ్యింది. రేపు సీఎం రేవంత్ రెడ్డి సారత్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు హ్యాట్రిక్ జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి తన కుమారుడు పట్నం రినీష్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి గాంధీభవన్ లో శుక్రవారం(16 ఫిబ్రవరి 2024) మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జీ దీపాదాస్ మున్షీ గారు, గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నారు.

‘పట్నం’ ఫ్యామిలీ అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సునితమ్మతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లానుంచి భారీగా అభిమానులు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు సునితమ్మతో పాటు కాంగ్రెస్ గూటికి చేరడానికి సిద్ధమయ్యారు. శుక్రవారం ఉదయం 11:00 గంటల వరకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు హైదరాబాద్ లోని బంజారాహిల్స్ నివాసానికి తరలి రావాలని పిలుపునిచ్చారు. ఇంటి నుంచి గాంధీ భవన్ కు కార్యకర్తలు తో భారీ ర్యాలీగా బయలు దేరి కాంగ్రెసులో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా మాజీ మంత్రి మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో అందరిలో ఆసక్తి ఏర్పడింది.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!