వికారాబాద్ జిల్లా యువతకు గుడ్ న్యూస్
– మిషన్ వాత్సల్యలో సోషల్ వర్కర్ ఉద్యోగాలు
– పది, ఇంటర్ అర్హతపై దరఖాస్తుల స్వీకరణ
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలోని యువతకు డీఎంహెచ్‌ఓ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. జిల్లాలోని మిషన్ వాత్సల్య (జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్)లో.. ఒప్పంద ప్రాతిపదికన సోషల్ వర్కర్, అవుట్ రీచ్ వర్కర్, ఎస్‌ఏఏ మేనేజర్, ఎస్‌ఏఏ సోషల్ వర్కర్, ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్/డిగ్రీ/పీజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలని పేర్కొన్నారు. అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 25 నుంచి 50 ఏళ్లకు మించరాదని స్పష్టం చేశారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.7,800ల నుంచి రూ.22,750ల వరకు జీతంగా చెల్లించడం జరుగుతుందన్నారు. ఈ అర్హతలున్నవారు ఎవరైనా నవంబర్ 16, 2022వ తేదిలోపు ఆఫ్‌లైన్ విధానంలో పోస్టు ద్వారా District Welfare Officer, Room No-58, Women, Children, Disabled and Senior Citizens Department, New Collectorate Complex, Vikarabad District, Telangana-501101 అడ్రస్‌కు దరఖాస్తులు పంపించవల్సి ఉంటుందని తెలిపారు. అకడమిక్ మెరిట్, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

