తిరంగా స్థిరంగా ఎగిరిద్దాం
– మున్సిపల్ కౌన్సిలర్ మంకాల రాఘవేందర్
– వార్డులో ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రతి ఇంటిపై జాతీయ తిరంగా జెండాను స్థిరంగా ఎగరేద్దామని తాండూరు మున్సిపల్ 26వ వార్డు కౌన్సిలర్ మంకాల రాఘవేందర్ పేర్కొన్నారు. ఆజాదీకా అమృతోత్సవ్, వజ్రోత్సవాలలో భాగంగా శుక్రవారం తన వార్డులో జాతీయ జెండా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మంకాల రాఘవేందర్ ఇంటింటికి వెళ్లి స్థానిక నేతల కలిసి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటిమీద మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని, జాతీయ భావం, దేశభక్తిని చాటుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు చెన్ బసప్ప, చందు, ప్రశాంత్, దినేష్, కోట ప్రసాద్, వీరు, శివ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



