కార్మికులపై వివక్ష తగదు

తాండూరు రాజకీయం వికారాబాద్

కార్మికులపై వివక్ష తగదు
– వెంటనే వారికి పీఆర్సీని అమలు చేయాలి
– సమ్మెకు పరిగి మాజీ ఎమ్మెల్యే టీఆర్ఆర్ మద్దతు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ కార్మికులపై అధికారులు, పాలకులు వివక్ష చూపించడం పద్దతి కాదని, కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, పరిగి మాజీ ఎమ్మెల్యే టీ.రామ్మోహన్ రెడ్డి(టీఆర్ఆర్) అన్నారు. గత 15రోజులుగా పెంచిన వేతనాల కోసం సమ్మె చేస్తున్న కార్మికులకు శుక్రవారం టీ.రామ్మోహన్ రెడ్డి స్థానిక నేతలతో కలిసి మద్దతు తెలిపారు. సమ్మెకు దిగిన కారణాలను కార్మికులను అడిగి తెలుసుకున్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి మాట్లాడారు. గతంలోనే ప్రభుత్వం కార్మికులకు పీఆర్సీని. ప్రకటించిందని గుర్తుచేశారు. కార్మికులకు న్యాయమైన డిమాండ్‌ను వెంటనే పరిష్కరించాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాండూరులో అధికారులు, పాలకుల మద్య ఉన్న రాజకీయాలను కార్మికులపై రుద్దడం పద్దతి కాదన్నారు. వెంటనే వారికి పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉత్తమ్ చంద్, జనార్ధన్ రెడ్డి, తాండూరు పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, పెద్దేముల్ మండల అధ్యక్షులు గోపాల్, పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ లింగదలి రవికుమార్, నాయకులు నవాజ్ తదితరులు ఉన్నారు.