కార్మికులను బలి చేయొద్దు

తాండూరు రాజకీయం వికారాబాద్

కార్మికులను బలి చేయొద్దు
– పీఆర్సీని వెంటనే అమలు చేయాలి
– ఏఐటీయూసీ జిల్లా నాయకురాలు విజయలక్ష్మి పండిత్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ కార్మికుల విషయంలో అధికారులు, పాలకులు కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఏఐటీయూసీ జిల్లా నాయకురాలు విజయలక్ష్మి పండిత్ అన్నారు. పెంచిన వేతనాలను చెల్లించి.. అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తాండూరు మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె సోమవారం 17వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెకు ఏఐయూటీసీ జిల్లా నాయకులు విజయలక్ష్మి పండిత్ కార్మికులకు మద్దతును కొనసాగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని మున్సిపాల్టీలలో కార్మికులకు పీఆరీ వేతనాలు అమలవుతుంటే తాండూరులో మాత్రం అమలు కావడం లేదని అన్నారు. పీఆర్సీ అంశం ఉన్న ఎజెండా కోర్టులో ఉందని అధికారులు, కార్మికుల అంశంపై కోర్టుకు వెళ్లలేదని పాలకులు వాదించడంలో కార్మికులే నష్టపోతున్నారని అన్నారు. న్యాయమైన డిమాండ్లను కోరుతున్న కార్మికులను బలిచేయొద్దన్నారు. ఇప్పటికైనా కార్మికులకు పెంచిన వేతనాలను అనులు చేయాలని లేదంటే సీఎం కేసీఆర్, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లేలా సమ్మెను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మున్సిపల్ స్టాఫ్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.