బీజేపీ గెలుపు యజ్ఞం పూర్తి చేద్దాం
– హనుమాన్ దేవాలయాల ముందు మొక్కులు
– రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్
– బీజేపీ ర్యాలీ, రోడ్ షో సక్సెస్ పై హర్షం
తాండూరు, దర్శిని ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు యజ్ఞాన్ని బాధ్యతగా పూర్తి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన రాజాసింగ్ పర్యటన, బైకు ర్యాలీ, రోడ్ షో సక్సెస్ కావడం పట్ల పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం తాండూరు పట్టణం రైల్వే స్టేషన్ హనుమాన్ దేవాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్, పార్టీ నేతలు పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాభివృద్ధి కోసం ప్రధాని మోడి సైనికుడిలా కృషి చేస్తున్నారని అన్నారు. మోడి నాయకత్వంలో సంపూర్ణ సమాజం నిర్మాణమవుతుందని అభిప్రాయ పడ్డారు. అదేవిధంగా తాండూరులో జరిగిన ర్యాలీ, రోడ్ షోతో బీజేపీలో కొత్త జోష్ నిండిందన్నారు. చేవేళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి భారీ మెజార్టీ ఖాయమన్నారు. బీజేపీ దేశంలో దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి దేవాలయ భూమినే కూల్చివేశారని ఆరోపణలు రావడం శోచనీయమన్నారు.
దేశంలో, చేవేళ్లలో బీజేపీ గెలుపు యజ్ఞాన్ని అందరు బాధ్యతగా పూర్తి చేయాలన్నారు. పార్టీ గెలుపు కోసం నేడు బూతు స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు హనుమాన్ దేవాలయాల్లో 5 టెంకాయలు కొట్టి, పూజలు చేసి మొక్కులు పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు నాగారం సర్సింలు, కొండా పీఏ వేముల విక్రమ్, మాజీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, జిల్లా అధికార ప్రతినిధి వెంకట్ జుంటుపల్లి, ఫ్లోర్ లీడర్ అంతారం లలిత, కౌన్సిలర్ సాహు శ్రీలత, మల్లప్ప, స్టేట్ కౌన్సిల్ మెంబర్ మల్లేశ్ యాదవ్, నాయకులు శేఖాపురం ఆంజనేయులు, మంతటి రాజు, జగదీష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

