టీఆర్ఎస్ పటిష్టానికి ఉత్సహాంగా కృషి చేయండి
– తాండూరు మండల బీసీ సెల్ అధ్యక్షులుగా చంద్రశేఖర్ గౌడ్
– ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: టీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు ఉత్సహాంగా పనిచేయాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సూచించారు. గురువారం తాండూరు మండల టీఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులుగా రావులపల్లి చంద్రశేఖర్ గౌడ్ నియామకం అయ్యారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు ఉత్సహాంగా కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను లబ్దిదారులకు చేరేవిధంగా. వాటిని సద్వినియోగం చేసుకునేలా నిత్యం అవగాహన కల్పించాలన్నారు. టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడంలో కీలకంగా మెగాలన్నారు. ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా దృష్టిసారించాలన్నారు. నూతన కమిటీ సభ్యులుగా ఎన్నికైన వారికి ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాందాస్ ప్రధాన కార్యదర్శి రాకేష్ గౌడ్ ల సమక్షంలో బీసీ సెల్ కమిటి అధ్యక్షులు చంద్రశేఖర్, కమిటి సభ్యులు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. మరోవైపు తాండూరు మండల బీసీ సెల్ ఇతర కమిటి సభ్యులను కూడ ఎన్నుకోవడం జరిగిందని పార్టీ మండల అధ్యక్షులు రాందాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ తాండూరు మండల యూత్ ప్రెసిడెంట్ రాజుగౌడ్, హనుమాన్ దేవాలయ చైర్మన్ ప్రశాంత్ గౌడ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

