తపాల శాఖలో ఉద్యోగాలు
– రూ. 33 నుంచి 35 వేల వరకు వేతనం
– అర్హులు ఎవరంటే.. గడువు ఎప్పటి వరకు అంటే
దర్శిని డెస్క్: తెలుగు రాష్ట్రాలు అయిన ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో తపాల శాఖకు సంబంధించి ఉద్యోగాలను భర్తి చేసేందుకు ఆ శాఖ నోటీఫికేషన్ జారీ చేసింది. రెండు రాష్ట్రాలలో 3,842 ఉద్యోగాలను భర్తి చేయబోతోంది. ఇందుకు సంబంధించి గత నెల నవంబర్ 15నే నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 14తో ఉద్యోగాల దరఖాస్తు గడువు తీరిపోతుందని అధికారులు వెల్లడించారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి పరీక్ష, ఫీజ్ లేదని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 2289 పోస్ట్ మెన్ ఉద్యోగాలు ఉండగా ఇందులో 108 మెయిల్ గార్డ్ జాబ్స్, 1166 ఎంటీఎస్ పోస్టులున్నాయని తెలిపింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 1553 పోస్ట్ మెన్ జాబ్స్ ఉండగా అందులో 82 మెయిల్ గార్డ్ పోస్టులు, 878 ఎంటీఎస్ పోస్టు లున్నాయని తెలిపింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ. 33,718/- నుండి రూ. 35,370/- వరకు ప్రతి నెల జీతం లభిస్తుందని నోటీఫికేషన్‌లో స్పష్టం చేశారు.
ఎవరు అర్హులంటే…
నోటిఫికేషన్ ప్రకారం ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు 18 ఏళ్లు నుండి 32 ఏళ్లు మద్య ఉండాలి. పోస్టుమాన్ జాబ్ కి ఇంటర్ చేసి ఉండాలి. మెయిల్ గార్డ్ పోస్ట్ కి 45 శాతంతో పదో తరగతి పాస్ అయ్యి ఉండాలి. గుర్తింపు ఉన్న బోర్డు నుండి ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి. కంప్యూటరు జ్ఞానం ఉండాలి.
ఎలా దరఖాస్తు చేసుకోవాంటే..
మొదటగా కింద ఇచ్చిన లింకు పై క్లిక్ చేయండి
https://www.indiapost.gov.in/
వెబ్సైట్ ఓపెన్ అవుతుంది
మీ డీటైల్స్ ని ఫిల్ చేయండి
మీ డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయండి
మీ ఫోటో ని అప్లోడ్ చేయండి
మీ అప్లికేషన్ లో పూర్తి వివరాలను ఫిల్ చేయండి
మరొకసారి మీ వివరాలను చెక్ చేసుకోండి
మీ అప్లికేషన్ ని సబ్మిట్ చేయండి

