విద్యార్థులతో పనులు చేయిస్తే సహించేది లేదు
– ఆశ్రమ పాఠశాలను సందర్శించిన బీఆర్ఎస్వీ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: విద్యార్థులతో పనులు చేయిస్తే సహించేది లేదని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు హెచ్చరించారు. సోమవారం తాండూరు పట్టణం సాయిపూర్ లోని గిరిజన ఆశ్రమ పాఠశాలను బీఆర్ఎస్వీ తాండూరు నియోజకవర్గ ఇంచార్జ్ పి.జిలాని, జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయలు సందర్శించారు. ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులతో పనులు చేయిస్తున్నారని వచ్చిన ఆరోపణలపై ఆరా తీశారు. పాఠశాల వార్డెన్, విద్యార్థులను కలిసి మాట్లాడారు. విద్యార్థులతో నిజంగా పనులు చేయిస్తున్నారా అని ఆరా తీశారు. విద్యార్థులతో పనులు పనులు చేయించరాదని, ఒకవేళ చేయిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

