కమలం కక్ష్యపై కన్నెర్ర..!
– మా రోహిత్ రెడ్డి నిప్పు
– నియోజకవర్గంలో నిరసన దీక్షలు
– తాండూరు బీఆర్ఎస్ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: కక్ష్య సాధింపులకు పాల్పడుతున్న కమలంపై తాండూరు గులాబీ నేతలు కన్నెర్ర జేశారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహిత్ రెడ్డికి మద్దతుగా తాండూరు పట్టణం, బషీరాబాద్, పెద్దేముల్ మండలాలలో నిరసన దీక్షలు చేపట్టారు.

బుధవారం తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన దీక్షలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, కౌన్సిలర్లు విజయాదేవి, సంగీత ఠాకూర్, బీఆర్ఎస్ నేతలు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్, ఉపాధ్యక్షులు హరిహరగౌడ్, దేవాలయాల చైర్మన్లు, అనుబంధ సంఘాల నాయకులు, ప్రతినిధులు, కౌన్సిలర్లు నల్ల కండువాలు, బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. బషీరాబాద్, పెద్దేముల్ మండలాలలో చేపట్టిన దీక్షకు జిల్లా గ్రంథాలయ చైర్మన్ ముఖ్య అతిథిగా వెళ్లి మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని అన్నారు. ఎమ్మెల్యేల ఎర కుట్రను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బయట పెట్టినందుకు కక్ష్య సాధింపులకు గురిచేస్తుందన్నారు. ఈడీ నోటీసులు అందించి బెదిరింపులు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మా రోహిత్ రెడ్డి నిప్పులాంటి మనిషి అని, ఎన్ని బెదిరింపులకు పాల్పడినా.. ఈడీ నోటీసులతో భయపెట్టినా బెదిలేది లేదని అన్నారు. సీఎం కేసీఆర్, తాండూరు ప్రజలు, నేతలు అంతా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి అండగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయాల చైర్మన్లు బంటారం సుధాకర్, రాజన్ గౌడ్, కుంచం మురళిధర్, యువనాయకులు నరుకుల నరేందర్ గౌడ్, సోషల్ మీడియా కన్వినర్లు టైలర్ రమేష్, ఇంతియాజ్, బషీరాబాద్‌లో మండల అధ్యక్షులు రాములు నాయక్, పెద్దేముల్ మండలంలో కోహీర్ శ్రీనివాస్, ద్యావారి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

