గొల్ల చెరువుపై చిన్నచూపేందుకు

తాండూరు రాజకీయం వికారాబాద్

గొల్ల చెరువుపై చిన్నచూపేందుకు
– చెరువును నమ్ముకున్న మత్స్యకారులకు ఇబ్బందులు
– కబ్జాలను విడిపించకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు
– మద్దతు తెలిపిన బీసీ సంఘం, మత్స్యకార సంఘం నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులోని గొల్ల చెరువు సంరక్షణకు ప్రభుత్వం, అధికారులు చిన్నచూపు ఎందుకు చూస్తున్నారని బీసీ సంఘం, మత్య్సకారుల సంఘం నాయకులు మండిపడ్డారు. గత రెండు రోజులుగా గొల్ల చెరువులో పాతుకుపోయిన గుర్రపు డెక్క మొక్కలను తొలగింపు చేస్తున్నారు. బుధవారం బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ పిలుపు మేరకు వారికి బీసీ సంఘం, మత్స్యకారుల సంఘం నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బీసీ సంఘం జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, మత్స్యకారుల సంఘం అధ్యక్షులు జంగం నరహరి, బీసీ సంఘం సోషల్ మీడియా ఇంచార్జ్ బస్సు తదితరులు మాట్లాడుతూ తాండూరులోని ‘ ఏకైక జలాశయం గొల్ల చెరువు సంరక్షణపై అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. చెరువులో సమస్యలను పరిష్కరించడంలో విఫలం అయ్యారని మండిపడ్డారు. చెరువులో గుర్రపు డెక్క పాతుకుపోవడంతో మత్య్సకారులు జీవనోపాధికి దూరమయ్యారని ఆవేధన వ్యక్తం చేశారు. వాటిని తొలగించే క్రమంలో చెరువులో దిగిన వారికి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని అన్నారు. అదేవిధంగా చెరువులో తూము లీకేజీలను పరిష్కరించాలని ఇరిగేషన్ అధికారులకు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదన్నారు. చెరువు సంరక్షణ కోసం ఎన్ని దర్నాలు, ఆందోళనలు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువును కాపాడాలన్నారు. చెరువు భూముల్లో కబ్జాలను కూడ చెరవిడిపించాలని డిమాండ్ చేశారు. లేదంటే చెరువును కాపాడుకునేందుకు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మత్య్సకారుల సంఘం ఉపాధ్యక్షులు జంగం ఆంజనేయులు, డైరెక్టర్లు జంగం రాజేష్, పకిరప్ప, కృష్ణ, జంగం పెద్ద నర్సింలు, బీసీ సంఘం యువనాయకులు రాము ముదిరాజ్, జుంటుపల్లి వెంకట్, తాండూరు మండల బీసీ సంఘం యువజన సంఘం అధ్యక్షులు బసంత్ కుమార్, సయ్యద్, మహదేవ్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.