దత్తాత్రేయుని సన్నిధిలో..!

తాండూరు రాజకీయం వికారాబాద్

దత్తాత్రేయుని సన్నిధిలో..!
– ఎమ్మెల్యే గువ్వలతో కలిసి విఠల్ నాయక్ పూజలు
– కుటుంబ సమేతంగా భక్తులకు అన్నదానం
తాండూరు, దర్శిని ప్రతినిధి: కర్ణాటక రాష్ట్రంలోని గానగపూర్‌లో వెలసిన శ్రీ దత్తాత్రేయుని సేవలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్ తరించారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కుటుంబ సభ్యులతో కలిసి చైర్మన్ విఠల్‌ నాయక్‌ దత్తాత్రేయున్ని దర్శించుకున్నారు. ప్రతినెల పౌర్ణమి రోజున చైర్మన్ విఠల్ నాయక్ గానగపూర్‌ దత్తాత్రేయ దర్శనం చేసుకోవడం ఆనవాయితీని పాటిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం పౌర్ణమిని పురస్కరించుకుని విఠల్ నాయక్ దత్తాత్రేయ స్వామి దర్శనానికి వెళ్లారు. అక్కడికి వచ్చిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి విఠల్ నాయక్ దత్తాత్రేయ స్వామి దర్శనం, పూజలు నిర్వహించారు. అనంతరం విఠల్‌ నాయక్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బాలరాజు కుటుంబ సభ్యులతో కలిసి భక్తులకు అన్నదానం నిర్వహించారు.

ఈ సందర్భంగా విఠల్ నాయక్ మాట్లాడుతూ త్రిమూర్తుల స్వరూపుడు అయిన దత్తాత్రేయ స్వామి దయ అందరిపై ఉండాలని ప్రార్థించారు. స్వామి కృపతో తనవంతుగా ప్రజలకు అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని.. నిర్వహిస్తానని పేర్కొన్నారు. అందరు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని, అందులోనే మానసిక ప్రశాంతత సిద్దిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి సిఐ జలంధర్ రెడ్డి, ఆలయ పూజారులు శరత్, భరత్, రాజు, నందకుమార్ భక్తులు తదితరులు ఉన్నారు.