వైభవంగా వైభవలక్ష్మీ పూజ

తాండూరు రాజకీయం వికారాబాద్

వైభవంగా వైభవలక్ష్మీ పూజ
– శంకర్‌ యాదవ్‌నివాసంలో వ్రత శోభ
– పూజలో పాల్గొన్న దంపతులు
– హాజరైన ప్రజా ప్రతినిధులు, నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరుకు ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, శ్రీ సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత భావనోళ్ల శంకర్ యాదవ్ నివాసంలో వైభవలక్ష్మీ పూజ వైభవంగా జరిగింది. మహిళలు తమ భర్త క్షేమంతో పాటు సౌభాగ్యం కోసం, కోరిన కోర్కెలు నెరవేరాలని వైభవలక్ష్మీ వ్రతం నిర్వహించడం హిందూ సంప్రదాయం. ఇందులో భాగంగా శుక్రవారం తాండూరు పట్టణంలోని భావనోళ్ల శంకర్ యాదవ్ నివాసంలో ఆయన సతీమణి చంద్రకళ వైభవలక్ష్మీ వ్రత పూజ జరుపుకున్నారు.

శంకర్ యాదవ్, చంద్రకళ దంపతులు పాల్గొని వేద పండితులు విశ్వం పంతులు ఆధ్వర్యంలో వైభవలక్ష్మీకి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, బందుమిత్రులు, పలువురు ప్రజా ప్రతినిధులు, నేతలు హాజరు కావడంతో వారి ఇంట సందడిగా మారింది.

వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కరణం పురుషోత్తంరావు, తాండూరు జెడ్పీటీసీ గౌడి మంజుల, బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ సీనీయర్ నాయకులు విజయ్ కుమార్ యాదవ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, సాయిపూర్ బాల్ రెడ్డి, మాజీ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల, కౌన్సిలర్లు నీరజాబాల్ రెడ్డి, బాలప్ప, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, చెంగోల్ ఎంపీటీసీ రత్నమాల రాము, సన్నిహితులు అరవింద్, మనోహర్ యాదవ్, సీనియర్ న్యాయవాది కుర్వ శ్రీనివాస్, న్యాయవాది చంద్రశేఖర్ రెడ్డి, ప్రేమ్ రాజ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బంటు మల్లప్ప, జొన్నల వినోద్, బార్డాన్ ఉదయ్ శంకర్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు దువచర్ల శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, చెంగోల్ గోపాల్, రఘునాధ్ రెడ్డి, అరవింద్ గౌడ్, కళ్యాణం చందు, సీనియర్ పాత్రికేయులు పట్లోళ్ల వేణుగోపాల్ రెడ్డి, రవిశంకర్, యువనాయకులు రాము యాదవ్. కిరణ్ కుమార్ యాదవ్, భావనోళ్ల హనుమయ్య, జుంటుపల్లి అరవింద్ రెడ్డి తదితరులు కూడ పూజలో పాల్గొని దర్శించుకున్నారు.