వైభవంగా అయ్యప్ప ఇరుముడి

తాండూరు రాజకీయం వికారాబాద్

వైభవంగా అయ్యప్ప ఇరుముడి
– శబరికి బయల్దేరిన అయ్యప్ప స్వాములు
తాండూరు, దర్శిని ప్రతినిధి: నలభై ఒక్క రోజుల పాటు అయ్యప్ప స్వామి కఠోర దీక్ష చేపట్టిన అయ్యప్ప స్వాములు ఇరుముడి కార్యక్రమాన్ని వైభవంగా పూర్తి చేసుకున్నారు. మంగళవారం పట్టణంలోని శ్రీ ధర్మశాస్త్ర దేవాలయంలో తాండూరు శ్రీ సాయిమేధ విద్యాలయం, ఆపిల్ కిడ్స్, చైతన్య జూనియర్ కళాశాల కరస్పాండెంట్ పెరుమాళ్ళ వెంకట్ రెడ్డి పట్టణంలోని గురుస్వాముల ఆధ్వర్యంలో ఇరుముడి కట్టుకున్నారు. అనతరం స్వాములతో కలిసి శబరి యాత్ర బయలుదేరారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శ్రేయోభిలాషులు ఇరుముడి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు. భక్తిశ్రద్ధలతో అయ్యప్పను పూజించిన ప్రతి ఒక్కరికి మంచే జరుగుతుందని తెలిపారు.