సంస్కృతికి ప్రతీక సంక్రాంతి ముగ్గులు

తాండూరు రాజకీయం వికారాబాద్

సంస్కృతికి ప్రతీక సంక్రాంతి ముగ్గులు
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌
– అర్బన్‌ పార్కులో ముందస్తు సంబురాలు
– ఉత్సహాంగా ముగ్గుల పోటీలు
– పాల్గొన్న వైస్ చైర్ పర్సన్‌, జెడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: సంక్రాంతి ముగ్గులు తెలుగు సంస్కృతికి ప్రతీకగా నిలుస్తాయని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, తాండూరు జెడ్పీటీసీ గౌడి మంజుల, పెద్దేముల్ ఎంపీపీ అనురాధ రమేష్, వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్ చారిలు అన్నారు. మంగళవారం తాండూరు అటవిశాఖ డిప్యూటీ రేజ్ అధికారి నాగజ్యోతి ఆధ్వర్యంలో తాండూరు మండలం అంతారం గ్రామ శివారులోని తెలంగాణ అర్బన్ పార్కు వద్ద సంక్రాంతి ముగ్గుల పోటీ నిర్వహించారు.

దీంతో అర్బన్‌ పార్కులో ముందస్తు సంక్రాంతి నెలకొంది. ఉత్సహాంగా కొనసాగిన ముగ్గుల పోటీలో తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, తాండూరు జెడ్పీటీసీ గౌడ్ మంజుల, పెద్దేముల్ ఎంపీపీ అనురాధ, వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాసాచారిలు న్యాయనిర్ణేతలుగా, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వైస్ ఎంపీపీ మధుల శ్రీనివాస్ చారి ముగ్గు వేసి ప్రారంభించిన పోటీలో మహిళలు సమీప ప్రాంతంలోని పాఠశాల విద్యార్థులు ఉత్సహాంగా పాల్గొన్నారు. పోటీలో మహిళలు, విద్యార్థులు అందమైన రంగవళ్లులు వేసి ఆకట్టుకున్నారు. అనంతరం న్యాయనిర్ణేతలు అయిన చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు, జెడ్పీటీసీ గౌడి మంజుల, ఎంపీపీ అనురాధ, వైస్ ఎంపీపీ మధులతలు విజేతలను ఎంపిక చేశారు. ఈ పోటీలో తాండూరు మండలం కోటబాస్పల్లి గ్రామానికి చెందిన మంజుల మొదటి బహుమతి, తాండూరుకు చెందిన కవిత రెండో బహమతి, కోటబాస్పల్లికి చెందిన లక్ష్మీబాయి మూడో బహుమతిని గెలుచుకోగా.. మిగతా వారు కన్సోలేషన్ బహుమతులను అందుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఆడవుల నుంచి ప్రకృతి పుట్టిందని, ప్రకృతి మనుషులకు సంస్కృతి నేర్పిందన్నారు. అలాంటి సంస్కృతి, సంప్రదాపాలను మేళవిస్తూ అర్బన్ పార్కులో ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం నిర్మించిన ఆర్బన్ పార్కుతో తాండూరులోని కాలుష్య నియంత్రణ సాధ్యపడుతుందన్నారు. అర్బన్ పార్కు భవిష్యత్తు తరాలకు మంచి భరోసా అవుతుందన్నారు. పార్కు అభివృద్ధికి తమవంతు తోడ్పాటు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్యాం సుందర్ రావు, సెక్షన్ ఆఫీసర్లు భాగ్యమ్మ, అన్వర్ హుస్సేన్, వెంకటలక్ష్మి, గ్రామ సర్పంచ్ రాములు, ఎంపీటీసీలు శాంతు, నీలు, మాజీ ఎంపీటీసీ గౌడ్ వెంకటేశం, కౌన్సిలర్ బోయరవి, నాయకులు ఈర్షాద్, ఇంతియాజ్, సలీం, లొంక నర్సింలు, బీట్ ఆఫీసర్లు మల్లయ్య, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.