స్వామి వివేకానందడు మాకు స్పూర్తి
– అందుకే బడికి మైక్ సెట్ వితరణ
– సేవను చాటిన అనిల్ రాథోడ్ యువసేన
తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశ సంస్కృతిని ప్రపంచానికి చాటిన స్వామి వివేకానందుడే మాకు స్పూర్తి అని తాండూరు అనిల్ రాథోడ్ యువసేన అధ్యక్షులు అనిల్ రాథోడ్ అన్నారు. గురువారం అనిల్ రాథోడ్ యువసేన ఆధ్వర్యంలో పెద్దేముల్ మండలం మంబాపూర్ లోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు మైక్ సెట్ వితరణ చేశారు. ఈ సందర్భంగా అనిల్ రాథోడ్ మాట్లాడుతూ స్వామి వివేకానందడు యువతకు మార్గదర్శకమని, ఆయన సూచించిన సేవా మార్గాన్ని స్పూర్తిగా తీసుకుని ఆయన జయంతి సందర్భంగా మైక్ సెట్‌ను అందజేయడం జరిగిందన్నారు. పాఠశాలకు మైక్ సెట్ లేదనే విషయం తెలుసుకుని తమవంతుగా అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రావణ్ కుమార్, ఎంపీటీసీ శ్రీనివాస్ సాగర్, మారెపల్లి సర్పంచ్ బల్వంత్ రెడ్డి, యువసేన సభ్యులు గోపాల్ చౌహాన్, ప్రేమ్ కుమార్, వినోద్ కుమార్, ప్రశాంత్ కుమార్, వార్డు సభ్యులు మోహిత్, కిరణ్ కుమార్, యూత్ అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

