మైనార్టీల‌ అభివృద్ధికి నిధులు కేటాయిస్తాం

తాండూరు వికారాబాద్

మైనార్టీల‌ అభివృద్ధికి నిధులు కేటాయిస్తాం
– ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి హామి
– స‌న్మానించిన ముస్లిం వెల్పేర్, మైనార్టీ నాయ‌కులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : వికారాబాద్ జిల్లా తాండూరులోని మైనార్టీల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామ‌ని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిలు హామి ఇచ్చారు. శనివారం తాండూరు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ నేతలతో పాటు ఎంఐఎం నేతలు హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాండూరులో మైనార్జీ వెల్సేర్ కమ్యూనిటీ హాల్‌ల‌ నిర్మాణంతో పాటు ప్రార్థనా మందిరాల్లో నీటి సమస్య పరిష్కారం కోసం దాదాపు 13 బోరు బావులను వేయించేందుకు రూ. 25 లక్షల చొప్పున మొత్తం రూ.50లక్షల నిధులు కేటాయించాలని వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ, ఎంపీలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహాకారంలో ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. మైనార్టీల అభివృద్ధి కోసం ఎల్లప్పుడు ముందుంటామని పేర్కొన్నారు. అదేవిధంగా తాండూరు మైనార్టీల అభివృద్ధి కోసం ఎమ్మెల్సీ కోటా కింద రూ. 25 క్షలు, ఎంపీ కోటా కింద మరో రూ. 25లక్షల నిధులు మంజూరు చేస్తామని హామి ఇచ్చారు. దీంతోపాటు తాండూరులో సెంట్రల్ లైటింగ్ విధానం కోసం మరో రూ. 50లక్షలు మంజూరు చేస్తామని ఎంపీ రంజిత్ రెడ్డి ప్రకటించారు. మరోవైపు అడిగిన వెంటనే నిధుల మంజూరుకు హామీ ఇవ్వడం పట్ల నాయకులు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డిలను శాలువా, పూల మాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నేతలు జావిద్, మక్సూద్, ముస్లిం వెల్పేర్ అడ్వయిజర్ కమిటి అధ్యక్షులు ఖుర్షిద్ హుస్సేన్, అబ్దుల్ అహాద్, వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బాబర్, కార్యదర్శి ఉస్మానియా గని, ఉపాధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, ఖయ్యూం, సంయుక్త కార్యదర్శి ఖయ్యూం అతహర్, కోశాధికారి ముక్రమ్, ఎంఐఎం అధ్యక్షులు హాది, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఖవి, మైనార్థీ నాయకులు షౌకత్ పటేల్, ఫారూఖ్ సోయిల్, గోల్కొండ సత్తార్, జమీల్ హైమద్, మోయిజ్, గౌస్ బాబా, అబ్దుల్ రహీం, షౌకత్ అలీ తదితరులు పాల్గొన్నారు.