బోనమెత్తిన గౌతాపూర్..!
– కాపాడమంటూ ఊరడమ్మకు, మైసమ్మకు వేడుకోలు
– గ్రామంలో వైభవంగా ఉత్సవాల శోభ
– ఆకట్టుకున్న జోగిని నిషా క్రాంతి ప్రదర్శన
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : కరుణించి.. కాపాడే తల్లులు మీరే అమ్మా.. అంటూ తాండూరు మండలం గౌతాపూర్ గ్రామ భక్తులు బోనమెత్తారు. గురువారం గ్రామంలో వెలసిన ఊరడమ్మ, మైసమ్మ అమ్మవార్ల బోనాల జాతర ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. జాతర ఉత్సవాలలో భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. జాతర సందర్భంగా ఆలయంలో వెలసిన అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర ఉత్సవాలలో ప్రముఖ జోగిని నిషా క్రాంతి సందడి చేశారు. బోనమెత్తుకుని డప్పు వాయిద్యాల మధ్య జోగిని నిషా క్రాంతి చేసిన ఆటా పాట ప్రదర్శనలు. భక్తులను మమైరిపించాయి.

అనంతరం గ్రామానికి చెందిన మహిళ భక్తులు, భక్తులు బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఆలయం చుట్టు ప్రదక్షణలు చేసి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. బోనాల ప్రదక్షణలతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసి జనసందోహంగా మారింది. ఈ జాతర ఉత్సవాలలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు సాయిరెడ్డి, గ్రామ సర్పంచ్ రాజప్ప గౌడ్, బీఆర్ఎస్ మహిళ కన్వినర్ శకుంతల, మాజీ సర్పంచులు జనార్ధన్ రెడ్డి, సూజాత గౌడ్, బీసీ సంఘం నాయకులు రాజుగౌడ్, నాయకులు రాంచంద్రారెడ్డి, అశోక్ రెడ్డి, పాండు రంగారెడ్డి, ప్రశాంత్, యువజన సంఘాల ప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

