ఆర్టీసీ ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండ

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

ఆర్టీసీ ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండ
– బస్సు క్షతగాత్రులకు రోజుల్లోనే పరిహారం
– ప్రత్యేక చొరవ చూపిన సీఎం రేవంత్ రెడ్డి
– పరిహారం చెల్లింపుపై ప్రతిపక్షాల హైడ్రామాలు
– పరిహారం చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : చేవేళ్ల మండలం మీర్జాగూడ ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలతో పాటు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు కూడా తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తోందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. ఈనెల 2న చేవేళ్ల వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందగా.. 50 మందికి పైగా గాయాలపాలు అయ్యారు.

మృతి చెందిన వారిలో 13 మంది తాండూరు నియోజకవర్గానికి చెందిన వారు ఉన్నారు. మృతులకు ప్రభుత్వం నుంచి రూ. 5లక్షలు, ఆర్టీసీ సంస్థ నుంచి రూ. 2లక్షలు మొత్తం రూ. 7లక్షల చొప్పున పరిహారం అందించిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు పరిహారం మంజూరు కాలేదు. తాజాగా ప్రభుత్వం బాధితులకు ఒక్కొక్కరి చొప్పున రూ. 2లక్షల పరిహారంను మంజూరు చేసింది.

దీంతో బుధవారం తాండూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో పరిహారం చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్‌తో కలిసి హాజరై వారి చేతుల మీదుగా క్షతగాత్రులకు, కుటుంబ సభ్యులకు పరిహారం చెక్కులను అందజేశారు. ఒక్కొక్కరికి రూ. 2లక్షల చొప్పున 10 మంది క్షతగాత్రులకు రూ. 20లక్షల పరిహారంను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రభుత్వం రోజుల్లోనే పరిహారం అందించి అండగా నిలిచిందన్నారు. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపించారని అన్నారు.
kvcs
గత పాలకులు బస్సు ప్రమాదాలలో బాధితులకు ఏండ్లు గడుస్తున్నా పరిహారం అందించలేకపోయిందని అన్నారు. ఇప్పుడు ప్రతిపక్షాలు హైడ్రామా రేంజ్‌లో విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మృతుల కుటుంబాలలో అర్హత కలిగిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కూడా ముందుకు వస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

విద్యార్థుల ఆచూకీ లభ్యం