అగ్నిమాపక శాఖలో ఉద్యోగాలు
– నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం
– పదో తరగతి అర్హతతో పోస్టులు
– దరఖాస్తు చేసుకోవచ్చు ఇలా
దర్శిని డెస్క్: అగ్నిమాపక శాఖలో ఉద్యోగాల భర్తికి దరఖాస్తుల ఆహ్వానం కోరుతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF ద్వారా నోటిఫికేషన్ జారీ చేసింది. ఫైర్ సర్వీసెస్ విభాగంలో కానిస్టేబుల్ డ్రైవర్-కం-పంప్ ఆపరేటర్ పోస్టులని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 451 పోస్టులను భర్తీ చేస్తున్నారు. కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తుకు అర్హులు. పదవ తరగతి విద్యార్హతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తులు సమర్పించాలని సూచించింది.
పోస్టులు, దరఖాస్తుల విధానం
కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులు – 183, ఫైర్ సర్వీసెస్ విభాగంలో కానిస్టేబుల్ డ్రైవర్-కం-పంప్ ఆపరేటర్ పోస్టులు – 268లతో మొత్తం 451 పోస్టులు ఉన్నాయి. 2023 జనవరి 23వ తేదీ నుంచి 2023 ఫిబ్రవరి 22వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. www.cisfrectt.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
విద్యార్హతలు ఇవే
పదవ తరగతి విద్యార్హతతో పాటు హెవీ మోటార్ వెహికల్, లైట్ మోటార్ వెహికల్, మోటార్ సైకిల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. డ్రైవింగ్ విభాగంలో మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి. 21 నుంచి 27 సంవత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాలకు నెలవారి వేతనాలు రూ.21,700/- నుంచి 69,100/- వరకు ఉంటాయి.
ఏవిధంగా ఎంపిక చేస్తారంటే
ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు, ధ్రువపత్రాల పరిశీలన, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష మరియు మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వాటిని కింద చూడవచ్చు.


