తాండూరులో త్వరలో ఈఎస్ఐ ఆసుపత్రి

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరులో త్వరలో ఈఎస్ఐ ఆసుపత్రి
– బీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు కృష్ణయ్య
– మున్సిపల్ కార్మిక యూనియర్ అధ్యక్షులుగా నరేందర్ గౌడ్ ఎన్నిక
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కృషితో త్వరలోనే ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు కాబోతుందని బీఆర్ఎస్ కార్మిక విభాగం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు కృష్ణయ్య అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని గంజ్ అసోసియేషన్ హాల్ లో మున్సిపల్ కార్మికులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు కృష్ణయ్యతో పాటు తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు కె. గోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూరులోని కార్మికుల కోసం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఆయన కృషితోనే తాండూరులో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు కాబోతుందన్నారు. అంతేకుండా మున్సిపల్ కార్మికుల సమస్యలకు ఎమ్మెల్యే తోడ్పాటుతో పరిష్కరించడం జరుగుతుందన్నారు. అందుకోసం కొత్తగా యూనియన్ కమిటి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా మున్సిపల్ కార్మిక యూనియన్ అధ్యక్షులుగా నరుకుల నరేందర్ గౌడ్ ను ఎన్నుకున్నారు. ఆయనతో పాటు 16 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని నరేందర్‌ గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్మిక విభాగం నాయకులు, మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.