పేదింటి పెండ్లిళ్లకు ప్రభుత్వం తోడ్పాటు
– కళ్యాణలక్ష్మి, షాదీముఖారక్ పథకాలు వరం
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– లబ్ధిదారులకు రూ. 1.37 కోట్ల చెక్కుల పంపిణీ
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: దేశంలో ఎక్కడా లేని విధంగా పేదింటి పెండ్లిళ్లకు తెలంగాణ సర్కారు ఆర్థిక తోడ్పాటు అందిస్తుందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు మండల తహసీల్దార్ కార్యాయలంలో రూ. 1 కోటి 37 లక్షల విలువైన కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ ద్వారా 137 మంది లబ్దిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హాజరై జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, తాండూరు ఎంపీపీ అనితా గౌడ్, జెడ్పీటీసీ గౌడ్ మంజుల, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు తదితరులతో కలిసి లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒకప్పుడు ఆడపిల్ల పెళ్లి చేయాలంటే పేదలు ఎన్నో కష్టాలు పడేవారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నారని అన్నారు. ఈ పథకాల ద్వారా లబ్దిదారులకు రూ. 1లక్ష 116లు అందిస్తూ పెండ్లి సంతోషాన్ని నింపుతున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మీ, షాదీ ముభారక్ పథకాలు ఆదర్శంగా నిలిచాయని, పేదలకు అండగా మారాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, తహసీల్దార్ చిన్నప్పల నాయుడు, వైస్ ఎంపీపీ స్వరూప వెంకట్రామ్ రెడ్డి, బీఆర్ఎస్ తాండూరు పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), కౌన్సిలర్లు ఆసిఫ్, సంగీత ఠాకూర్, ముక్తార్, సర్పంచులు మేఘనాథ్ గౌడ్, ఎత్తరి రాములు, బాయికాడి లాల్ రెడ్డి, నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, హేమంత్ కుమార్, ఎంపీటీసీలు, నేతలు సిరిగిరిపేట్ వెంకట్రామ్ రెడ్డి, సిరిగిరిపేట్ పండరి, మాజీ ఉపసర్పంచ్ హసన్ పటేల్, డిప్యూటి తహసిల్దార్ ధనుంజయ్, ఆర్ఐ రాజారెడ్డి, సీనియర్ అసిస్టెంట్ వేణు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

