మళ్లీ ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ
– మున్సిపల్ కార్యాలయంలో కౌంటర్ల ఏర్పాటు
– ఎవరు దరఖాస్తు చేసుకోవాలంటే..?
– వెల్లడించిన మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన దరఖాస్తులను మళ్లీ స్వీకరించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఈ మేరకు తాండూరు మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి ఓ ప్రకటన కూడా విడుదల చేశారు.

ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహస్తున్నట్లు స్పష్టం చేశారు. గతంలో దరఖాస్తులు చేసుకోలేని వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా గతంలో చేసుకున్న దరఖాస్తుల్లో ఎమైనా ఇబ్బందులు ఉన్న వారు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఇందుకోసం కొత్త మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మున్సిపల్లో ప్రజా సేవ కేంద్రం ఏర్పాటు
తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ప్రజా పాలన సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ప్రారంభించారు. పట్టణంలోని పేదల నుంచి దరఖాస్తును స్వీకరించారు. ప్రతి రోజు ఉదయం 10-30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సేవా కేంద్రం అందుబాటులో ఉంటుందని ఆమె తెలిపారు. ప్రజలు సేవా కేంద్రంలో ప్రజా పాలన ఆరు గ్యారెంటీలపై దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, అధికారులు రమేష్, కృష్ణయ్య, నీరటి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

