జుంటుపల్లి ప్రాజెక్టు ఉరకలు
– అలుగుపై నుంచి పారుతున్న వరధనీరు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గం యాలాల మండలంలోని ప్రసిద్ద జుంటుపల్లి ప్రాజెక్టు ఉరకలు వేస్తోంది. ఆదివారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరధనీరు చేరుతోంది. ప్రాజెక్టు అలుగుపై నుంచి వరధ నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది.
వరధ ఉధృతితో క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. ప్రాజెక్టు నిండుగా ప్రవహిస్తుండడంతో చూపరులను ఆకట్టుకోంది. ప్రాజెక్టులోకి నీరు చేరడంతో సమీప ప్రాంతాలకు చెందిన ప్రజలు తిలకించేందుకు వెళుతున్నారు.
