ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు..!
– 2.73 శాతం డీఏ పెంపు
– ప్రకటించిన మంత్రి హరీష్ రావు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం కబురు అందించింది. ఉద్యోగులకు, పెన్షనర్లకు 2.73 శాతం డీఏ(కరువు భత్యం) పెంచింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతున్నట్లు స్పష్టం చేశారు. గతంలో 17.29 శాతం ఉండగా కొత్తగా 20.02 శాతానికి పెంచుతున్నట్లు తెలిపారు. సర్కారు తీసుకున్న నిర్ణయం వల్ల 2.88 లక్షల మంది పెన్షనర్లకు, 4.40 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ది చేకూరుతుందని మంత్రి హరీష్ రావు తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఉద్యోగులకు తెలుపుతు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


