తెలంగాణ ఖ్యాతిని పెంచిన కంది

టెక్నాలజీ తాండూరు తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

తెలంగాణ ఖ్యాతిని పెంచిన కంది
– గొప్ప ప్రచారంతో కీర్తిని పెంచాలి
– కొద్ది మాసాల్లోనే పాలమూరు నీళ్లు పారిస్తాం
– కంది బోర్డు, ఉల్లి కోల్డ్ స్టోరేజీలకు త్వరలో నిర్ణయం
– వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
– తాండూరు కందికి జీఐ గుర్తింపు అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర గొప్ప తనాన్ని తాండూరు కంది అంతర్జాతీయ స్థాయిలో నిలిపిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం తాండూరు కందికి ప్రకటించిన జీఐ (భౌగోళిక గుర్తింపు) ప్రధానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే’ రోహిత్ రెడ్డి, వ్యవసాయ విశ్వ విద్యాలయ సంచాలకులు డాక్టర్ జగదీశ్వర్‌లతో కలిసి

హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ ఆంధ్రా రాష్ట్రాలలో వైవిద్యమైన వనరులు ఉన్నాయని. వాటికి గుర్తింపు రాక మరుగున పడ్డాయన్నారు. తెలంగాణ వచ్చాక 6వది అయిన కంది గుర్తింపుతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో 16 వదిగా అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చిందన్నారు. తాండూరులోని అట్టబుల్లెట్ ఖనిజాల నుంచి పండే కందిలో ఉండడం వల్ల కంది ద్వారా తెలంగాణ రాష్ట్ర పెరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వమే తాండూరు కందికి జీఐ గుర్తింపు అందించడం గొప్ప సంబరమన్నారు. తాండూరు కంది గురించి ప్రచారం చేయాలని, దాని కీర్తిని పెంచాలన్నారు. మన ప్రాంతానికి చెందిన వాటిని కొనియాడితే స్వాతంత్రం అవుతుందని, ఇతర వాటిని పొగిడితే బానిసత్వం అవుతుందన్నారు. అదేవిధంగా రాబోయే రోజులలో వ్యవసాయానిదే ఉన్నత భవిష్యత్తు ఉంటుందన్నారు. ఉద్యావన, ఆరు తడి పంటలను వె తీసుకోవాలన్నారు. కంది పంటను ఎప్పటికి వదులుకోవద్దన్నారు. అధిక లాభాలు వచ్చే విధంగా కంది వంగడాలపై పరిశోధనలు జరుగుతున్నారు. అదేవిధంగా నూనె గింజల పంటలపై కూడా దృష్టిసారించాలన్నారు. దేశంలో వ్యవసాయమే ఉన్నతమైనది అని అన్నారు. మూస పంటలు వేసి.. రసాయన ఎరువులతో భూమి ఆరోగ్యాన్ని దెబ్బతీయొద్దన్నారు.

కొద్ది మాసాల్లోనే పాలమూరు నీళ్లు

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి రంగా రెడ్డి జిల్లాలో ఉన్న వికారాబాద్, తాండూరు నియోజకవర్గాలకు కొద్ది మాసాల్లోనే పాలమూరు రంగారెడ్డి నీళ్లు పారిస్తామన్నారు. కాళె శ్వరం కంటే అద్భుతంగా పాలమూరు ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుందన్నారు. ఒక్కో మోటారును 1లక్ష 95 వేల హర్స్ పవర్ (149 మేగా వాట్స్)లో ప్రాజెక్టు సిద్ధమవుతుందన్నారు. అలాంటి ప్రాజెక్టుపై కొందరు దురుద్దేశ పూర్వకంగా అడ్డుకునేందుకు కేసులు వేశారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కూడ పట్టించుకోలేదన్నారు. 19 ఏండ్లుగా తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాలకు రావాల్సిన కృష్ణా జలాల వాటను తేల్చలేక పోయిందన్నారు. ఆసియాలోనే అద్భుతంగా తీర్చిదిద్దుకుంటున్న పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును నియోజక వర్గ ప్రజలు బస్సుల్లో తరలివచ్చి పరిశీలించాలని సూచించారు. సీఎం కేసీఆర్ సహాకారంతో తాండూరు, వికారాబాద్ నియోజవర్గాలకు కొద్ది మాసాల్లోనే పాలమూరు నీళ్లు పరిస్తామనే భరోసా ఇస్తున్నామని అన్నారు.

త్వరలోనే కందిబోర్డుపై నిర్ణయం

మరోవైపు తాండూరులో కంది బోర్డును ఏర్పాటు చేసేలా ప్రభుత్వ సహాకారంతో కృషి చేస్తామన్నారు. దీంతో పాటు రైతుల కోసం ఉల్లి కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుకు ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. తాండూరు కందిని పాఠ్యాంశాలలో చేర్చే విధంగా చొరవ చూపుతామన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తాండూరులో కందిబోర్డు, ఉల్లి కోల్డ్ స్టోరేజ్లు మంజూరు చేయించాని కోరారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతుల సంక్షే మానికి కృషి చేస్తున్నారని అన్నారు. అనంతరం మంత్రి నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాస్త్రవేత్తలకు తాండూరు కంది జీఐ గుర్తింపు పత్రాన్ని అందజేశారు. తాండూరు కంది గుర్తింపు కోసం కృషి చేసిన రైతు సంఘం ప్రతినిధి నర్సింలు, పలువురు రైతులను మంత్రి నిరంజన్ రెడ్డి సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపి రంజిత్ రెడ్డిలను గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ కె. నిఖిల, అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి, శాస్త్రవేత్తలు డా. సుధారాణి, డా. సుధాకర్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.